ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌లు వేసుకోవాలంటున్నారు.. నేనైతే అలా చేయకపోవచ్చు: ట్రంప్

ABN, First Publish Date - 2020-04-04T22:33:16+05:30

అసలే కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న అమెరికాలో తాజాగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న అవాంఛిత వ్యాఖ్యాలు మరింత కలకలం, సందిగ్ధత సృష్టిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అసలే కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న అమెరికాలో తాజాగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న అవాంఛిత వ్యాఖ్యాలు మరింత కలకలం, సందిగ్ధత సృష్టిస్తున్నాయి. ఇటీవల దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించిన వివరాలను ప్రజలతో పంచుకునేందుకు ఆయన ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్( సీడీసీ) చేసిన సూచనల గురించి ఆయన ప్రస్తావించారు. కరోనా కట్టడి కోసం ప్రజలు మాస్కులు ధరించాలని సీడీసీ సూచించినట్టు తెలిపారు. అయితే దీన్ని పాటించాలా వద్దా అనేది ఐఛ్చికమని, తాను మాత్రం పాటించకపోవచ్చునని వ్యాఖ్యానించారు. దీనిపై ట్విటర్ వేదికగా పెను దుమారం చెలరేగింది. ట్రంప్‌ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అంటువ్యాధుల కట్టడికి చేసిన సూచనలను ఓ దేశాధినేత ఇలా బుట్టదాఖలు చేయడం సబబేనా అని వారు మండిపడుతున్నారు. 

Updated Date - 2020-04-04T22:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising