ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అణు శాస్త్రవేత్త శేఖర్‌ బసు కొవిడ్‌తో కన్నుమూత

ABN, First Publish Date - 2020-09-25T07:12:26+05:30

ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, అణుశక్తి సంఘం మాజీ చైర్మన్‌ డాక్టర్‌ శేఖర్‌ బసు కరోనాతో కన్నుమూశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా, సెప్టెంబరు 24: ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, అణుశక్తి సంఘం మాజీ చైర్మన్‌ డాక్టర్‌ శేఖర్‌ బసు కరోనాతో కన్నుమూశారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కరోనాతో పాటు కిడ్నీ సమస్యలకు కొంతకాలంగా చికిత్స పొందు తున్నారు. 4 రోజుల క్రితమే ఆయన 68వ ఏట అడుగుపెట్టారు. దేశ అణుశక్తి కార్య క్రమాల్లో సేవలందించి 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. బసు కుటుం బ సభ్యులకు రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. అద్భుతమైన ఇంజనీర్‌ను దేశం కోల్పోయిందని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత వికాస్‌ సిన్హా అన్నారు. 1952 సెప్టెంబరు 20న బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శేఖర్‌ బసు జన్మించారు. 1974లో ముంబైలోని వీర్‌మాతా జీజాజాయ్‌ టెక్నాలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. 

Updated Date - 2020-09-25T07:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising