ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు ఊతమిచ్చే ఎక్స్‌‘ప్లోజివ్స్‌’!!

ABN, First Publish Date - 2020-09-27T08:01:33+05:30

కరోనా కల్లోల వేళ.. మాస్క్‌ను ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేసే మరో అధ్యయన నివేదిక వెలువడింది. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ వర్సిటీ శాస్త్రవేత్త హోవర్డ్‌ ఎ.స్టోన్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం దీన్ని రూపొందించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పీ, టీ, కే, డీ, బీ, జీ అక్షరాలతో మొదలయ్యే పదాలతో జాగ్రత్త

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 : కరోనా కల్లోల వేళ..  మాస్క్‌ను ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేసే మరో అధ్యయన నివేదిక వెలువడింది. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ వర్సిటీ శాస్త్రవేత్త హోవర్డ్‌ ఎ.స్టోన్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం దీన్ని రూపొందించింది. ఆంగ్ల వర్ణమాలలోని పీ, టీ, కే, డీ, బీ, జీ వంటి అక్షరాలను ‘ప్లోజివ్స్‌’ అంటారు. వీటినే థంబ్‌ స్టాప్స్‌ లేదా స్టాప్‌ సౌండ్స్‌ అని కూడా పిలుస్తారు. ప్లోజివ్‌ అక్షరాలతో మొదలయ్యే పదాలను పలికే క్రమంలో నోటి నుంచి బలంగా వెలువడే గాలి, నీటితుంపరలు అతి సునాయాసంగా మీటరు దూరం ప్రయాణిస్తాయి.


ప్రధానంగా ‘పీ’ అక్షరంతో మొదలయ్యే పదాలను ఉచ్ఛరించినప్పుడు నోటి నుంచి గాలి సగటున సెకనుకు 1.2 నుంచి 1.5 మీటర్ల వేగంతో దూసుకెళ్తుందని వెల్లడించారు. ఒకవేళ ప్లోజివ్‌ అక్షరాలతో కూడిన పదాల వాడకం వరుసగా జరిగితే.. గాలి, నీటితుంపరలు 30 సెకన్ల వ్యవధిలోనే 2 మీటర్లకుపైగా దూరానికి చేరగలవన్నారు. మాట్లాడే క్రమంలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి జరగడానికి ‘ప్లోజివ్స్‌’ పదాలు ఊతమిచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.  

Updated Date - 2020-09-27T08:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising