ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ నలుగురిలో ఒకరికి కరోనా టీకా... మొదటి దశకు ఏర్పాట్లు పూర్తి!

ABN, First Publish Date - 2020-12-04T17:44:14+05:30

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాక్సినేషన్ తొలిదశలో ప్రతీ నలుగురిలో ఒకరికి టీకా వేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాక్సినేషన్ తొలిదశలో ప్రతీ నలుగురిలో ఒకరికి టీకా వేయనున్నారు. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి‌లో కరోనా వ్యాక్సిన్ డోసేజీలను భద్రపరచనున్నారు. ఇక్కడి నుంచి పాలీక్లీనిక్‌లకు వ్యాక్సిన్ డోసేజీలను తరలించనున్నారు. వ్యాక్సినేషన్ తొలి దశలో ఢిల్లీలోని మొత్తం జనాభాలోని 20 నుంచి 25 శాతం మందికి టీకా వేయనున్నారు.


ఈ విషయమై ఢిల్లీ ఆరోగ్య విభాగానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దేశంలోని మిగిలిన పట్టణాలతో పోల్చిచూస్తే, ఢిల్లీలో మధుమేహం, బీపీ, క్యాన్సర్, హృద్రోగం, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు అధికశాతంలో ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ముందుగా కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

Updated Date - 2020-12-04T17:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising