ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలను కాపాడే ఎంజైమ్‌

ABN, First Publish Date - 2020-07-10T06:34:40+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. అయితే పెద్ద వారితో పోల్చితే పిల్లలు తక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఉదాహరణకు అమెరికాలో జనాభాలో 18 ఏళ్లలోపు వారు 22 శాతం మంది ఉంటే వారిలో 1.7 మాత్రమే కరోనా బారిన పడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యుస్టన్‌, జూలై 9: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. అయితే పెద్ద వారితో పోల్చితే పిల్లలు తక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఉదాహరణకు అమెరికాలో జనాభాలో 18 ఏళ్లలోపు వారు 22 శాతం మంది ఉంటే వారిలో 1.7 మాత్రమే కరోనా బారిన పడ్డారు. ఇందుకు గల కారణాలను అమెరికాలోని టెక్సస్‌ యూనివర్సిటీకి చెందిన హ్యుస్టన్‌లోని హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌ (యూటీ హెల్త్‌) పరిశోధకులు వివరించారు. వీరి ప్రకారం.. మానవుల్లో సాధారణంగా ఆంజియోటెన్సివ్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2 లేదా ఏసీఈ 2 ఉంటుంది. ఇది మానవ శరీరంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించడానికి వీలు  కల్పిస్తుంది. అయితే ఈ ఎంజైమ్‌ పెద్దవారితో పోల్చితే పిల్లల్లో తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఏసీఈ 2 పిల్లల రోగ నిరోధక వ్యవస్థపై పెద్దవారి కంటే మెరుగ్గా పని చేస్తుంది. దీంతో పిల్లల్లో కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. కరోనా సోకినప్పుడు దానిపై పోరాడే రోగ నిరోధక వ్యవస్థలోని కీలకమైన టీ సెల్స్‌ పెద్ద వారిలో తగ్గినట్లు తేలింది. కానీ పిల్లల్లో టి కణాలు స్థిరంగా ఉన్నట్లు యూటీ హెల్త్‌ పరిశోధకులు తెలిపారు. ‘‘పిల్లల్లో  ఏసీఈ 2 తక్కువగా ఉంటుంది. దీని కారణంగా పిల్లలు తక్కువగా కరోనా బారిన పడుతున్నారు’’ అని యూటీ హెల్త్‌కు చెందిన మాథ్యుహార్టింగ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-10T06:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising