ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ పోస్టుపై చర్యలు లేవని.. ఫేస్‌బుక్‌ ఉద్యోగుల రాజీనామాలు!

ABN, First Publish Date - 2020-06-03T23:20:54+05:30

నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నిరసనకారులను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయన్న ట్విట్టర్.. ట్రంప్ ట్వీట్‌ను హైడ్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు తమ నిబంధనలను ఉల్లంఘించడం లేదంటూ ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. ట్రంప్ పోస్టుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చాలామంది ఫేస్‌బుక్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పనిచేస్తున్న కొందరు తమ యాజమాన్యం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇలాంటి సంస్థలో పనిచేయలేమంటూ రాజీనామాలు చేసేశారు. ‘ఈ విషయంలో ఫేస్‌బుక్‌దే తప్పు. ఇలాంటి ప్రవర్తనను నేను క్షమించలేను’ అంటూ ట్వీట్ చేసిన టిమోతీ జే అవేని అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తాను ఫేస్‌బుక్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించాడు. ఇలానే ఉద్యోగం వదిలేసిన మరో ఉద్యోగి, ‘ఏకీభవించలేని నిబంధనలను,  భావాలకు ఇకపై నేను మద్దతు ఇవ్వనక్కర్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-06-03T23:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising