ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔరా అనిపించిన ఏనుగు తెలివి..!

ABN, First Publish Date - 2020-02-22T00:30:43+05:30

ఓ భారీ ఏనుగు నీరు లేక ఎండిపోయిన కాలువలోకి దిగింది. పైకి ఎక్కాలంటే ఒకే ఒక్క మార్గం. సన్నని మెట్ల మార్గం మాత్రమే అది పైకి వచ్చేందుకు అనువుగా ఉంది. ఆ మెట్లు.. ఏనుగు పాదం అంత కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఓ భారీ ఏనుగు నీరు లేక ఎండిపోయిన కాలువలోకి దిగింది. పైకి ఎక్కాలంటే ఒకే ఒక్క మార్గం. సన్నని మెట్ల మార్గం మాత్రమే అది పైకి వచ్చేందుకు అనువుగా ఉంది. ఆ మెట్లు.. ఏనుగు పాదం అంత కూడా ఉండవు. కానీ.. ఆ మెట్లనే ఆసరాగా చేసుకుని ఎంతో జాగ్రత్తగా పైకి ఎక్కింది ఆ ఏనుగు. అంతేనా.. అలా పైకి వచ్చిన ఏనుగు ఒక్క క్షణం ఆగి తాను ఎక్కిన మెట్లవైపు తెరిపారా చూసింది. ఆ సీన్‌ను వీడియో తీసిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది. ‘‘చూశారా ఏనుగులు ఎంత తెలివైనవో. సన్నటి మెట్ల మార్గాన్ని కూడా ఎంత చక్కగా ఉపయోగించుకుందో. తమ చుట్టూ ఉన్న వనరులను ఏనుగులు ఎంతో తెలివిగా ఉపయోగించుకుంటాయి. తమ మనుగడ కోసం దిగ్భందనాలను, విద్యుత్ ఫెన్షింగ్‌లను సైతం ఎలా డీల్ చేయాలనే దానిని కూడా చాలా త్వరగా నేర్చుకుంటాయి.’’ అని సదరు ఫారెస్ట్ ఆఫీసర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలాఉండగా, సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏనుగు చాతుర్యాన్ని చూసి ఔర అంటున్నారు నెటిజన్లు. ఈ ఏనుగు క్రమశిక్షణ చూస్తుంటే మానవజాతిపై జాలివేస్తోందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.

Updated Date - 2020-02-22T00:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising