ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాతో చర్చలు సాధ్యమైనప్పుడు.. పాక్‌తో ఎందుకవ్వదు?: ముఫ్తీ

ABN, First Publish Date - 2020-11-30T02:16:17+05:30

కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే భారత్-పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాల్సిందేనని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే భారత్-పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాల్సిందేనని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పునరుద్ఘాటించారు. చైనాతో చర్చలు జరపగలిగినప్పుడు.. పాకిస్తాన్‌తో చర్చలు ఎందుకు సాధ్యం కాదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న డీడీసీ ఎన్నికలపైనా ఆమె విమర్శలు సంధించారు. ఎన్నికల వల్ల కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించదని చెప్పుకొచ్చారు. కాగా రోష్ని పథకాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదనీ.. కొందరు వ్యక్తులు కావాలనే దానిపై కుంభకోణం ముద్రవేశారని ఆమె ఆరోపించారు. ‘‘అది మా అసెంబ్లీ ఆమోదం పొందిన ఓ చట్టం. అది కుంభకోణం కానేకాదు...’’ అని ఆమె అన్నారు. కాగా ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేత రవీందర్ రైనా తీవ్ర స్థాయిలో స్పందించారు. డీడీసీ తొలిదశ ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతం నమోదు కావడంతో ఆమెకు దిక్కు తోచడం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. కశ్మీర్‌లోని సామాన్యుడు ఆమె సిద్ధాంతాన్ని తిరస్కరించాడన్నారు. 

Updated Date - 2020-11-30T02:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising