ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19 కాలంలో జరగే మొదటి ఎన్నికల మార్గదర్శకాలు ఇవే

ABN, First Publish Date - 2020-09-25T22:22:18+05:30

అక్టోబర్, నవంబర్ నెలల్లో మూడు విడుతలుగా జరిగే ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం దృష్టినీ ఆకర్షించబోతున్నాయి. ఆయా దేశాల్లో జరిగే ఎన్నికలకు బహుశా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మార్గదర్శం అవుతాయనే చర్చ కూడా జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కాలంలో దేశంలో మొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. బిహార్ అసెంబ్లీకి జరగనున్న ఈ ఎన్నికలపై రాజకీయంగా ఎంతటి ప్రభావం ఉందో.. కోవిడ్-19 భయమూ అంతగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ పలు మార్గదర్శాలను సూచించింది.


మూడు విడతలుగా జరగనున్న బిహార్ ఎన్నికల పోలింగ్‌ను ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నారు. ఇంతకు ముందు కొన్ని ప్రత్యేక సందర్భాలు తప్పితే సాయంత్రం 5 వరకే నిర్వహించేవారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గంట పొడగించినట్లు ఈసీ పేర్కొంది. అయితే, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో ఇది వర్తిందని ఈసీ తెలిపింది.


కోవిడ్-19 అనంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఓటర్లు భౌతిక దూరాన్ని పాటించాలని, తప్పని సరిగా సానిటైజ్ చేసుకోవాలని, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓటర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని దీనిని తప్పనిసరి చేసినట్లు వారు చెప్పారు. అంతే కాకుండా 7.2కోట్ల చేతి తొడుగులను ఏర్పాటు చేసినట్లు, ఓటు వేసే సమయంలో ఓటర్లు ఇవి తప్పనిసరిగా ఉపయోగించాలని అన్నారు.


మొత్తంగా 45 లక్షల మాస్కులు, 7 లక్షల సానిటైజర్లు, 6 లక్షల పీపీఈ కిట్లు, 6.7 లక్షల ఫేస్ షీల్డులు, 23 లక్షల చేతి తొడుగులు ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.


అక్టోబర్, నవంబర్ నెలల్లో మూడు విడుతలుగా జరిగే ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం దృష్టినీ ఆకర్షించబోతున్నాయి. ఆయా దేశాల్లో జరిగే ఎన్నికలకు బహుశా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మార్గదర్శం అవుతాయనే చర్చ కూడా జరుగుతోంది.

Updated Date - 2020-09-25T22:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising