‘రాజకీయ’ వ్యాఖ్యలపై స్పందించం: సీఈసీ
ABN, First Publish Date - 2020-11-13T08:59:37+05:30
బిహార్‌లో రీకౌంటింగ్ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. రాజకీయ నేతల వ్యాఖ్యలపై తాము స్పందించబోమని.. తుది నిర్ణయం ప్రజలదేనని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా...
న్యూఢిల్లీ: బిహార్‌లో రీకౌంటింగ్ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. రాజకీయ నేతల వ్యాఖ్యలపై తాము స్పందించబోమని.. తుది నిర్ణయం ప్రజలదేనని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా తేల్చిచెప్పారు. బిహార్ ఎన్నికలు సజావుగా ముగిసినందుకు సహచర ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్‌కుమార్‌లతో కలిసి గురువారమిక్కడ రాజ్‌ఘాట్‌లో గాంధీజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో జరిగిన ఆలస్యానికి కారణాలేంటో రాష్ట్ర సీఈవో సవివరంగా తెలియజేశారని గుర్తుచేశారు. నాలుగు సార్లు ఈసీ ప్రెస్‌మీట్లు పెట్టి వివరణ ఇచ్చిందన్నారు. పోలింగ్ కేంద్రాలు ఎక్కువ కావడంతో ఈవీఎంల సంఖ్య కూడా పెరిగిందని ఈసీ వర్గాలు తెలిపాయి. పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య గత ఎన్నికల్లో 1.3 లక్షలు పోల్ కాగా.. ఈ దఫా రెండున్నర లక్షలకు పైగా వచ్చాయని తెలిపాయి.
Updated Date - 2020-11-13T08:59:37+05:30 IST