ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
ABN, First Publish Date - 2020-03-16T16:53:26+05:30
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను వినియోగిం చుకుంటున్నారు. గతంలో కేవలం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే వారు. ర్యాలీలు, సభలు నిర్వహిం చేవారు. ప్రస్తుతం సామాజిక...
కర్నూలు(కలెక్టరేట్) : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను వినియోగిం చుకుంటున్నారు. గతంలో కేవలం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే వారు. ర్యాలీలు, సభలు నిర్వహిం చేవారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు కీలకంగా మారాయి. ఓటర్లకు మరిం త చేరువయ్యేందుకు వీటినే ఎక్కువగా వినియోగిస్తు న్నారు. జిల్లాలోని 53 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఖరారు అయ్యారు. పురపాలక సంఘాలలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 17వ తేదీన సర్పంచ్‌ల నామినేషన్ల పర్వం మొదలవుతుంది. 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు, 23న కార్పొరేషన్, మున్సిపాల్టీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 27న పంచాయతీ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్, 29న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా కొందరు యువకులను ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుం టున్నారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్ తదితరాలలో ఓట రుకు ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇలా చేస్తే ఇబ్బందే..
ఎన్నికల ప్రచారం కసం వ్యంగ్య చిత్రాలు, వీడియోలు షేర్ చేయడం, ప్రత్యక్షంగా, పరోక్షంగా నిందలు వేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సందేశాలను పోస్టు చేయడం నేరం. ఇలాంటివి తెలియక షేర్ చేసినా ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లే. సోషల్ మీడియాలో వ్యక్తులను కించపరచడం, నచ్చని నాయకుడి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడం, అభ్యర్థుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టడం నిషిద్ధం. ఇతరులు పెట్టిన ఇలాంటి పోస్టులకు కామెంట్లు పెట్టినా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. అసత్య ప్రచారాలు చేయడం, ఇతరుల వ్యక్తిగత సమాచారం షేర్ చేయడం కూడా నిషిద్ధమే. ప్రభుత్వ ఉద్యోగులు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయకూడదు.
రా.. రమ్మని..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటుకూ ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు దూర ప్రాంతంలో ఉన్న ఓటర్లను రప్పించేం దుకు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ రోజుకు స్వగ్రామానికి రావాలని సామాజిక మాధ్య మాల ద్వారా విన్నవిస్తున్నారు. ప్రయాణం, ఇతర ఖర్చులు చెల్లిస్తామని సందేశం పంపుతున్నారు. గతంలో చిన్న సమావేశం ఏర్పాటు చేయాలన్నా రూ.వేలు ఖర్చు అయ్యేది. సామాజిక మాధ్యమాలు విస్తరిం చిన తరువాత ఇంటిలో కూర్చొనే ఇలాంటి ప్రచారం చేసే వెసులుబాటు కలుగుతోంది.
ప్రచార చిత్రాలు అప్‌లోడ్
అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయిస్తున్నారు. ఈ పని కోసం కొందరిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను పోస్టు చేయిస్తున్నారు. కొంత మంది ప్రత్యేకంగా యాప్‌లు తయారు చేసుకుని ప్రచారానికి వినియోగిస్తున్నారు.
పరువుకు భంగం కలిగిస్తే: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు సామాజిక మాధ్య మాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అభ్యర్థుల వ్యక్తిగత విషయాలను సామా జిక మాధ్యమాలలో పోస్టు చేసి, వారి పరువుకు భంగం కలిగించినా, కించప రిచినా ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. పంచ్‌లు, కార్టూన్లు, వెక్కిరిం తలు, వ్యంగ్య చిత్రాలు షేర్ చేయడం ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టడమే కాకుండా, వ్యక్తులకు పరువు నష్టం కలిగించినట్లు భావిస్తారు. సామాజిక మా ధ్యమాలతో నిత్యం గడిపే యువత జాగ్ర త్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు.
సైబర్ నేరం
సామాజిక మాధ్యమాలలో ఇతరుల పరువకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే పోలీసుశాఖ వీటిని సైబర్ నేరంగా పరిగణిస్తోంది. మత విశ్వాసాలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, వైరుధ్యాలు సృష్టించిన వారికి ఐపీసీ సెక్షన్ 295ఎ, 153ఎ ప్రకారం శిక్ష పడే అవకాశం ఉంది. పరువు నష్టం దావాకు సంబంధించి సెక్షన్ 499 ప్రకారం శిక్షలు పడతా యని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది. సైబర్ నేరాలకు ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించింది. సామాజిక మాధ్య మాల్లో పోస్టిం గ్‌లపై అనవసరంగా స్పందించి కటకటాల పాలు కాకుండా సంయమనం పాటించడం మేలు.
Updated Date - 2020-03-16T16:53:26+05:30 IST