ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్డింగ్‌పై నుంచి దూకి, క‌రోనా అనుమానితుడు ఆత్మ‌హ‌త్య‌

ABN, First Publish Date - 2020-07-09T16:15:17+05:30

కరోనా వైర‌స్‌పై నెల‌కొన్న భ‌యం ఆ వృద్ధుని ప్రాణాల‌ను హ‌రించింది. రాజ‌స్థాన్‌లోని జైపూర్‌న‌‌కు చెందిన కైలాశ్‌‌(78) క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేరాడు. ఇది జ‌రిగిన‌ 13 గంటల తర్వాత ఆసుపత్రి పైకప్పు నుంచి దూకాడు. పరిస్థితి విషమించ‌డంతో అతన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: కరోనా వైర‌స్‌పై నెల‌కొన్న భ‌యం ఆ వృద్ధుని ప్రాణాల‌ను హ‌రించింది. రాజ‌స్థాన్‌లోని జైపూర్‌న‌‌కు చెందిన కైలాశ్‌‌(78) క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేరాడు. ఇది జ‌రిగిన‌ 13 గంటల తర్వాత ఆసుపత్రి పైకప్పు నుంచి దూకాడు. పరిస్థితి విషమించ‌డంతో అతన్ని వెంటనే ఐసీయూకు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ  కైలాశ్‌ మృతి చెందాడు. కాగా ఆసుప‌త్రిలో స‌రైన వస‌తులు లేక‌పోవ‌డంతో కైలాశ్ క‌ల‌త చెందార‌ని, రాత్రంతా నిద్ర‌పోలేద‌ని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా కైలాశ్ మృతి చెందిన అనంత‌రం అత‌ని క‌రోనా రిపోర్టు వ‌చ్చింది. దానిలో అత‌ను క‌రోనా నెగిటివ్ అని తేలింది. దీనిని చూసిన బంధువులంతా కైలాశ్ తొంద‌ర‌ప‌డ్డార‌ని అంటున్నారు. అత‌ను డిశ్చార్జ్ అయ్యే స‌మ‌యానికి మృతి చెంద‌డాన్ని బంధువులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాగా ఆస్తమా వ్యాధితో బాధ‌ప‌డున్న కైలాశ్‌ను అత‌ని కుటుంబీకులు మూడు ఆసుప‌త్రులకు తీసుకు వెళ్లారు. అయితే క‌రోనా అనుమానంతో కైలాశ్‌ను ఆయా ఆసుప‌త్రుల‌లో చేర్చుకోలేదు. చివ‌రికి ఒక ఆసుప‌త్రిలో చేర్చుకున్నారు. అయితే క‌రోనా రిపోర్టు రాక‌ముందే కైలాశ్ క‌రోనా భ‌యంతో ఆసుప‌త్రి భ‌వ‌నం పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 

Updated Date - 2020-07-09T16:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising