ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవేంద్ర ఫడ్నవీస్ నా జీవితాన్ని నాశనం చేశాడు: ఏక్‌నాథ్ ఖడ్సే

ABN, First Publish Date - 2020-10-21T21:06:32+05:30

మహారాష్ట్రలో రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే కమలం పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే కమలం పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. వచ్చే శుక్రవారం ఆయన ఎన్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే.. పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఖడ్సే.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంచలన ఆరోపణలు చేశారు.


ఫడ్నవీస్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. దాదాపు నాలుగేళ్లు తాను మానసిక క్షోభకు గురైనట్లు చెప్పారు. తనను పార్టీ నుంచి తొలగించాలని ఫడ్నవీస్ భావించినట్లు చాలా సందర్భాల్లో చెప్పినట్లు తెలిపారు. బీజేపీని వీడటం బాధాకరమైన పరిణామమే అయినప్పటికీ తనకు మరో దారి లేదన్నారు. తనను రేప్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ఎన్సీపీలో చేరాలన్న ఖడ్సే నిర్ణయాన్ని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్వాగతించారు. తన సేవలను బీజేపీ గుర్తించలేదని, తన సేవలను గుర్తించే పార్టీలో చేరాలని భావించడంలో ఎలాంటి తప్పు లేదని పార్టీ మారాలన్న ఖడ్సే నిర్ణయాన్ని పవార్ సమర్థించారు.

Updated Date - 2020-10-21T21:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising