ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిరమిడ్‌లను ఏలియన్స్‌ కట్టారా..ఎలాన్ మస్క్ విచిత్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-08-03T21:13:32+05:30

విద్యుత్ వాహనాల తయారీకి ఎలాన్ మస్క్ ఎంత ప్రసిద్ధో.. విచిత్ర వ్యాఖ్యలకు కూడా ఆయన అంతగా ప్రాచుర్యం పొందారు. సోషల్ మీడియా వేదికల్లో తరచూ వింత వింత వ్యాఖ్యలు చేస్తూ కల్లోలం సృష్టిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: విద్యుత్ వాహనాల తయారీకి ఎలాన్ మస్క్ ఎంత ప్రసిద్ధో.. విచిత్ర వ్యాఖ్యలకు కూడా ఆయన అంతగా ప్రాచుర్యం పొందారు. సోషల్ మీడియా వేదికల్లో తరచూ వింత వింత వ్యాఖ్యలు చేస్తూ కల్లోలం సృష్టిస్తుంటారు. తాజాగా..పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించినట్టున్నారు..స్పష్టంగా తెలుస్తోంది..అంటూ ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అయన నిజంగానే ఇలా అన్నారా లేక జోక్ చేస్తున్నారా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. దాదాపు 5.4 లక్షల లైకులతో, 86 వేల రీట్వీట్‌లతో సోషల్ మీడియాను దున్నేసింది. మరి సహజంగానే ఈ ట్వీట్ ఈజిప్టు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఏకంగా ఆదేశ అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి స్పందించారు. ‘మస్క్..  మీ వర్క్‌ను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. అయితే మీరు ఓ సారి ఈజిప్టుకు రండి. పిరమిడ్లపై ఉన్న రాతలను పరిశీలించండి. పరమిడ్లను నిర్మించిన వారి సమాధుల్ని చూడండి. మీ కోసం వెయిట్ చేస్తున్నాం’ అని ఆమె ట్వీట్ చేశారు. 


Updated Date - 2020-08-03T21:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising