ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాశాఖ మంత్రి... ‘ఇంటర్’కు అడ్మిషన్ తీసుకున్నారు...

ABN, First Publish Date - 2020-08-11T22:46:34+05:30

జార్ఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి... విద్యార్ధిగా మారారు. ఇంటర్మీడియెట్ చదివేందుకు ఆయన అడ్మిషన్ తీసుకున్నారు. మంత్రి జగర్‌నాథ్ మహ కేవలం పదో తరగతి వరకే చదివారు. కాగా... కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయనను మంత్రి పదవి వరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచి : జార్ఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి... విద్యార్ధిగా మారారు. ఇంటర్మీడియెట్ చదివేందుకు ఆయన అడ్మిషన్ తీసుకున్నారు. మంత్రి జగర్‌నాథ్ మహ కేవలం పదో తరగతి వరకే చదివారు. కాగా... కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయనను మంత్రి పదవి వరించింది.


విద్యాశాఖ మంత్రిగా పదవి దక్కింది. అయితే ఆయన పదవి చేపట్టిన రోజు నుంచి కూడా ప్రతిపక్షాలు... కేవలం పదో తరగతి చదివిన వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా విధులెలా నిర్వహిస్తాడంటూ ప్రశ్నలు, విమర్శల వర్షాన్ని కురిపించాయి. ఇతర పార్టీల నేతల నుంచి వస్తోన్న ఈ విమర్శలు... ఆయనను ఎంతో బాధించాయి. ఈ క్రమంలోనే...  తనను విమర్శించిన వాళ్లకు తగిన సమాధానం చెప్పాలని, ఇందుకోసం ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నారు.


అనుకున్నడే తడవుగా... బోకారో జిల్లాలోని దేవి మహోతో కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. చదువుకు వయస్సుతో కానీ, స్థితిగతులు, హోదాలతో కానీ సంబంధం లేదని నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


చదువును పూర్తి చేస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి... పదో తరగతి చదివిన మంత్రి ఏం చేస్తాడని తనపై కొందరు విమర్శలు చేశారని, అందువల్లే ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-11T22:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising