ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా, అర్జెంటీనాలలో భూకంపం... తీవ్రత 4.4గా నమోదు!

ABN, First Publish Date - 2020-12-01T12:44:41+05:30

రష్యాలో భూకంపం సంభవించింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: రష్యాలో భూకంపం సంభవించింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. యూఎస్జీఎస్ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం రష్యాలోని సిటోవస్కయ్ గవాన్ కు ఆగ్నేయంలో 88 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది.


భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 4.24 నిముషాలకు భూకంపం సంభవించింది. ఈ ఏడాది మార్చిలో రష్యాలోని తూర్పు ప్రాంతమైన కురిల్ ద్వీపంలో భూకంపం చోటుచేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఆ సమయంలో భూకంప తీవ్రత 7.5 గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 56.7 కిలోమీటర్ల దిగువన ఉందని గుర్తించారు. అప్పుడు హవాయిలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. కాగా ఈరోజు ఉదయం రష్యాతో పాటు అర్జెంటీనాలో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఈ భూకంపాన్ని ధృవీకరించింది, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున అర్జెంటీనాలోని శాన్ ఆంటోనియో డి లాస్ కోబ్రేకు పశ్చిమ-నైరుతి దిశలో 76 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. 

Updated Date - 2020-12-01T12:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising