జపాన్ దేశంలో భూకంపం
ABN, First Publish Date - 2020-06-01T11:08:35+05:30
జపాన్ దేశంలోని సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.....
టోక్యో (జపాన్): జపాన్ దేశంలోని సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జపాన్ రాజధాని నగరమైన టోక్యో నగరానికి ఉత్తర తూర్పు తీరాన 86 కిలోమీటర్ల దూరంలో సోమవారం తెల్లవారుజామున 2.32 గంటలకు భూకంపం సంభవించిందని జపాన్ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు.
Updated Date - 2020-06-01T11:08:35+05:30 IST