ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల నిరసనపై మౌనం వీడిన దుశ్యంత్ చౌతాలా

ABN, First Publish Date - 2020-12-10T22:58:34+05:30

వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనపై హర్యానా ఉప ముఖ్యమంత్రి, జన్‌నాయక్ జనతా పార్టీ అధినేత దుశ్యంత్ చౌతాలా ఎట్టకేలకు మౌనం వీడారు. రైతులకు కనీస మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనపై హర్యానా ఉప ముఖ్యమంత్రి, జన్‌నాయక్ జనతా పార్టీ అధినేత దుశ్యంత్ చౌతాలా ఎట్టకేలకు మౌనం వీడారు. రైతులకు కనీస మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చింని అన్నారు. రైతు సంఘాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాయని ఆయన గుర్తు చేశారు. తన నివాసంలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సహా కేబినేట్ సహచరులకు విందు ఏర్పాటు చేశఆరు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం కూడా అందుకు ఒప్పుకుంది. అంతే కాకుండా బుధవారం వారికి లిఖిత పూర్వక హామీ కూడా ఇచ్చింది’’ అని దుశ్యంత్ చౌతాలా అన్నారు.


వ్యవసాయ చట్టాలకు రైతులు దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. అయితే పంజాబ్, హర్యానా రైతులు మిగతా రాష్ట్రాల వారికంటే తీవ్ర స్థాయిలో నిరసన చేపడుతున్నారు. బీజేపీ మినహా చాలా పార్టీలు రైతుల నిరసనకు మద్దతు ఇచ్చాయి. అయితే రైతుల నిరసనపై హర్యానా ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజెన్లు కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తనపై ఒత్తిడి పెరగడంతో దుశ్యంత్‌కు మౌనం వీడక తప్పలేదు.

Updated Date - 2020-12-10T22:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising