ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎంకే ప్రధాన కార్యదర్శి బరిలో దురై మురుగన్

ABN, First Publish Date - 2020-03-16T20:30:28+05:30

డీఎంకే కోశాధికారిగా ఉన్న దురై మురుగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నారు. డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: డీఎంకే కోశాధికారిగా ఉన్న దురై మురుగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నారు. డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ మృతి నేపథ్యంలో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈనెల 29న పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో కోశాధికారి పదవికి మురుగన్ రాజీనామా చేసి ప్రధాన కార్యదర్శికి పోటీ చేస్తారు.


డీఎంకే ప్రధాన కార్యదర్శిగా 43 ఏళ్ల పాటు కొనసాగిన 97 ఏళ్ల అన్బళగన్ ఈనెల 7న చెన్నైలో కన్నుమూశారు. 1977 నుంచి తొమ్మిది సార్లు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా పని చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా సేవలందించారు. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి ఆయన అత్యంత సన్నిహితుడు. 1944 నుంచి 1957 వరకూ పచ్చయప్ప కాలేజీలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు.

Updated Date - 2020-03-16T20:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising