ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్జా- కోయంబత్తూర్ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

ABN, First Publish Date - 2020-10-30T12:15:21+05:30

షార్జా నుంచి కోయంబత్తూరుకు గుట్టుగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ బాగోతాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోయంబత్తూర్ (తమిళనాడు): షార్జా నుంచి కోయంబత్తూరుకు గుట్టుగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ బాగోతాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు అధికారులు రట్టు చేశారు. ఆరుగురు విమాన ప్రయాణికులు షార్జా నుంచి 7 కిలోల బంగారాన్ని పేస్టు రూపంలో కోయంబత్తూరుకు విమానంలో తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకొని బంగారం స్మగ్లింగ్ బాగోతం గురించి ప్రశ్నిస్తున్నారు. 7కిలోల బంగారం విలువ 3.6 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. 


వందేభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దుబాయ్ నుంచి కోయంబత్తూరు వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోనూ కొందరు ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు డిప్యూటీ డైరెక్టరు జి సతీష్ చెప్పారు. భార్యాభర్తలు బంగారాన్ని లో దుస్తుల్లో దాచుకొని తీసుకువస్తుండగా సీఐఎస్ఎఫ్, కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ దంపతులు బంగారం స్మగ్లింగ్ చేసేందుకు మూడు నెలలకు ఓ సారి దుబాయ్ వెళ్లి వస్తుంటారని దర్యాప్తులో తేలింది. బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి పైనుంచి ఇతర కెమికల్స్ పూత పూసి దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్నారని దర్యాప్తులో బయటపడింది. 

Updated Date - 2020-10-30T12:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising