ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనికుల యూనిఫాం శానిటైజ్ చేసేందుకు ‘జెర్మీక్లీన్’

ABN, First Publish Date - 2020-06-13T15:10:27+05:30

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సైనికుల యూనిఫాం శానిటైజ్ చేసేందుకు ప్రత్యేకంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) కొత్తగా ‘జెర్మిక్లీన్’ పేరిట శానిటైజర్ ఛాంబర్ ను అభివృద్ధి చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్‌డీవో సృష్టి 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సైనికులు, పోలీసుల యూనిఫాం శానిటైజ్ చేసేందుకు ప్రత్యేకంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) కొత్తగా ‘జెర్మిక్లీన్’ పేరిట శానిటైజర్ ఛాంబర్ ను అభివృద్ధి చేసింది. డీఆర్డీవో రూపొందించిన జెర్మీ క్లీన్ శానిటైజింగ్ ఛాంబర్ ను ఢిల్లీలోని పార్లమెంటు వీధిలోని పోలీసుస్టేషనులో ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ఢిల్లీ పోలీసుల యూనిఫాంతో పాటు కేన్స్, కేన్స్ షీల్డులు, హెల్మెట్లను శానిటైజ్ చేసేందుకు ఈ ఛాంబర్ ను వినియోగించనున్నారు. ఢిల్లీ నగరంలో యూనిఫాం శానిటైజ్ చేసేందుకు వీలుగా డీఆర్ డీవో జెర్మీక్లీన్ పేరిట శానిటైజింగ్ ఛాంబర్ తయారు చేసి ఇచ్చిందని ఢిల్లీ డీసీపీ ఈష్ సింఘాల్ చెప్పారు. 15 నిమిషాల్లోనే 25 జతల పోలీసు యూనిఫాంలను జెర్మీక్లీన్‌లో శానిటైజ్ చేయవచ్చని డీఆర్ డీవో అధికారి చెప్పారు. ఈ శానిటైజర్ ఛాంబర్‌లో డ్రై హీట్ ట్రీట్‌మెంట్ చేస్తున్నామని డీఆర్‌డీవో అధికారులు వివరించారు.  

Updated Date - 2020-06-13T15:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising