ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం కోర్టులోనూ ట్రంప్‌కు ఎదురు దెబ్బ!

ABN, First Publish Date - 2020-11-29T21:59:00+05:30

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల చెల్లకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆయనకు పెన్సీల్వేనియా సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చెల్లకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆయనకు పెన్సీల్వేనియా రాష్ట్ర సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోలైన పోస్టల్ ఓట్లు చెల్లకుండా చేయాలంటూ ట్రంప్ తరఫు న్యాయవాదులు ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేకాకుండా.. వీలైతే..ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలనే పూర్తిగా రద్దు చేసి రాష్ట్ర శాసనసభే విజేతలను నిర్ణయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విచారణ సందర్భంగా.. ట్రంప్ న్యాయవాదులు 2019 నాటి పెన్సిల్వేనియా రాష్ట్ర చట్టాన్ని ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో పోస్టల్ ఓట్లకు అవకాశం కల్పించే ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని వాదించే ప్రయత్నం చేశారు. 


అయితే..ట్రంప్ చేసిన రెండు ప్రతిపాదనలను న్యాయమూర్తులు ఏకగ్రీవంగా కొట్టేశారు. 2019 నాటి చట్టాన్ని ఇప్పుడు సవాలు చేయడం కుదరదన్న జడ్జీలు..ఎన్నికల ఫలితాల్లో విజయమెవరిదో తెలిసిపోతోందని కూడా వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలనే రద్దు చేయాలన్న ప్రతిపాదనపై మాత్రం వారు తీవ్రంగా స్పందించారు. 6.9 మిలియన్ ప్రజలకు ఓటు హక్కుకు దూరం చేయమంటారా అంటూ ట్రంప్ తరఫు న్యాయవాదులకు సూటి ప్రశ్నలు వేశారు. దీంతో పెన్సిల్వేనియాలో బైడెన్ విజయం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. నవంబర్ 24న బైడెన్ సాధించింనట్టు అక్కడి అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో బైడెన్ ట్రంప్‌పై 81 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

Updated Date - 2020-11-29T21:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising