ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో రక్షణ లేదు.. రాష్ట్రపతి పాలన పెట్టండి : మదన్ శర్మ డిమాండ్

ABN, First Publish Date - 2020-09-12T18:17:29+05:30

మహారాష్ట్రలో రక్షణ లేదని నేవీ మాజీ అధికారి మదన్ శర్మ ఆరోపించారు. ‘‘మెసేజ్ ను ఫార్వర్డ్ చేసిన కారణంగా పది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్రలో రక్షణ లేదని నేవీ మాజీ అధికారి మదన్ శర్మ ఆరోపించారు. ‘‘మెసేజ్ ను ఫార్వర్డ్ చేసిన కారణంగా పది మంది శివ సైనికులు తమ ఇంటికి వచ్చి దాడి చేశారు. నా జీవితం మొత్తం దేశం కోసమే సమర్పించా. ఇలాంటి ప్రభుత్వాలు మనుగడ సాగించకూడదు.’’ అని మదన్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విథించాలని ఆయన కుమారుడు సన్నీ శర్మ డిమాండ్ చేశారు.


‘‘శివసేన నాయకులను అరెస్ట్ చేయడంతో మేము తృప్తి చెందడం లేదు. మాకు మహారాష్ట్రలో రక్షణ లేదు. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి. మళ్లీ ఎన్నికలను నిర్వహించాలి’’ అని సన్నీ శర్మ డిమాండ్ చేశారు. తమకు ఉద్ధవ్ ప్రభుత్వంపై ఏమాత్రం నమ్మకం లేదని ఆయన కూతురు పేర్కొన్నారు. 


నేవీ రిటైర్డ్ అధికారి మదన్ శర్మ (65) పై నలుగురు శివసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎం ఉద్ధవ్‌ను అపహాస్యం చేస్తూ గీసిన కార్టూన్‌ను ఫార్వర్డ్ చేశారంటూ శుక్రవారం అర్ధరాత్రి ఆయన నివాసానికి వెళ్లి శివసేన కార్యకర్తలు దాడి చేశారు. దీంతో నలుగురు శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘ఉద్ధవ్ పై వచ్చిన కార్టూన్ ను మదన్ శర్మ ఫార్వర్డ్ చేశారు. దీంతో శివసేన కార్యకర్తలు ఆయన నివాసానికి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కన్నుకు తీవ్రంగా గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2020-09-12T18:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising