ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామసభల నిర్వహణపై డీఎంకేకు బీజేపీ మద్దతు

ABN, First Publish Date - 2020-10-04T19:49:18+05:30

గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభలను అన్నాడీఎంకే ప్రభుత్వం ఆఖరి నిమిషంలో రద్దు చేయడం పట్ల ఆ పార్టీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తీవ్ర నిరసన ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభలను అన్నాడీఎంకే ప్రభుత్వం ఆఖరి నిమిషంలో రద్దు చేయడం పట్ల ఆ పార్టీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తీవ్ర నిరసన ప్రకటించింది. అదే సమయంలో డీఎంకే అధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలను సమర్థించింది. ఈ నిర్ణయం కూటమికి నాయకత్వం వహిస్తున్న అధికార అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం సృష్టించింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గ్రామసభలను అన్నాడీఎంకే ప్రభుత్వం రద్దు చేయడం భావ్యం కాదంటూ బీజేపీ రాష్ట్ర  ఉపాధ్యక్షరాలు వానతి శ్రీనివాసన్‌ విమర్శించారు. భౌతికదూరం పాటించి గ్రామసభలను నిర్వహించడానికి బదులుగా  రద్దు చేయడం గర్హనీయమన్నారు. వానతి శ్రీనివాసన్‌ చేసిన ఈ ప్రకటన అన్నాడీఎంకే కూటమిలో సంచలనం కలిగించింది.


గతంలో వచ్చేయేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోనే మెగా కూటమి ఏర్పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు చేసిన ప్రకటన సృష్టించిన అలజడి సద్దుమణగిన నేపథ్యంలో... కూటమికి విరుద్ధంగా వానతి శ్రీనివాసన్‌ ప్రకటించడం మరింత సంచలనానికి దారితీసింది. రాష్ట్రంలో వ్యవసాయ బిల్లులపై రైతుల్లో అవగాహన కల్పించే రీతిలో అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు గ్రామసభలను నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ అన్నాడీఎంకే కూటమికి దూరమవుతుందని పరోక్ష సంకేతంగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


అన్నాడీఎంకేలో ప్రస్తుతం సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై అయోమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ నేత కూటమి కట్టబాట్లకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే గ్రామసభలను సమర్థిస్తూ ప్రకటన చేయడం త్వరలో జరుగనున్న రాజకీయ మార్పులకు నిదర్శనమని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అన్నాడీఎంకే, బీజేపీల నడుమ సన్నిహిత సంబంధాలు లేవని వానతి శ్రీనివాసన్‌ ప్రకటన స్పష్టం చేస్తోందని పేర్కొంటున్నారు.


Updated Date - 2020-10-04T19:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising