ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరు అల్లర్లు: బీజేపీపై డీకే ఫైర్

ABN, First Publish Date - 2020-10-14T20:10:33+05:30

నిందితులెవరో నిర్ధారణ కాకముందే నిందితుల చేత నష్ట పరిహారం వసూలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరంగా ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతే కాకుండా అల్లర్లు జరగడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: నగరంలో సంచలనం సృష్టించిన అల్లర్ల కేసు విచారణకు సంబంధించి సీసీబీ చార్జిషీట్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ల పేర్లు నమోదు చేయడంపై కర్ణాటక కాంగ్రెస్ అధినేత డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల పేర్లు నమోదు చేయడం వెనుక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. వారి (ప్రభుత్వ) తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని డీకే అన్నారు.


కాగా ఈ అల్లర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీస్తోంది. ఈ విధ్వంసకాండలో జరిగిన నష్టాన్ని నిందితుల నుంచే వసూలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళనల సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విధానాన్ని అవలంభించారు. తాజాగా యడియూరప్ప సర్కారు కూడా దాన్ని ఫాలో అవుతున్నది. అయితే, నిందితులెవరో నిర్ధారణ కాకముందే నిందితుల చేత నష్ట పరిహారం వసూలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరంగా ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతే కాకుండా అల్లర్లు జరగడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని, దాని గురించి మాట్లాడకుండా తాము తప్పించుకునేందుకు యడియూరప్ప సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2020-10-14T20:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising