ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రజనీ పార్టీ పెట్టరు సరే.. మరి..

ABN, First Publish Date - 2020-12-30T16:46:26+05:30

రాజకీయాల్లోకి అడుగు పెట్టేది లేదని తేల్చిసిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. మునుముందు ఏం చేయబోతున్నారోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రజనీ సపోర్టు ఎవరికి?

పార్టీల్లో విస్తృత చర్చ


చెన్నై(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లోకి అడుగు పెట్టేది లేదని తేల్చిసిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. మునుముందు ఏం చేయబోతున్నారోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. రజనీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన నోటి నుంచి ‘ఒక్క మాట’ చెప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందుకు ఎవరికి వారుగా వివిధ పార్టీల నేతలు రజనీతో భేటీ అయ్యేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆయన మద్దతు పొందేందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ ప్రజాసేవలో కొనసాగుతామని రజనీ స్పష్టం చేసినందున ఆయన సహకారం తమకు ఉపయోగడుతుందని భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఎటొచ్చి ఏమవుతుందోనని ఆయా పార్టీల నేతలు రజనీ ప్రకటనపై ఆచితూచి స్పందించారు. మరీ ముఖ్యంగా రజనీతో కలిసి పనిచేస్తానంటూ ఆది నుంచి చెబుతున్న సీనియర్‌ నటుడు, మక్కల్‌ నీదిమయ్యం అధినేత కమల్‌హాసన్‌ తొలిగా స్పందించారు.


రజనీ ప్రకటనతో తాను నిరాశ చెందానని, అయితే రాజకీయాల్లోకి రావడం కన్నా ఆయన ఆరోగ్యంగా ఉండడమే తనకెంతో ముఖ్యమని వ్యాఖ్యనించారు. ప్రచారం ముగియగానే తాను రజనీని కలుస్తానని ప్రకటించారు. ‘నా రజనీ క్షేమంగా ఉండాలి. ఎక్కడున్నా ఆయన బాగుండాలి’ అని ఆకాంక్షించారు. రజనీతో భేటీ అయ్యాక అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో రజనీని కలిసే తొలి రాజకీయ నేత కమల్‌ అయ్యే అవకాశముంది. అయితే ఆయన విన్నపాన్ని రజనీ ఏ మేరకు మన్నిస్తారన్నది వేచి చూడాల్సి వుంది. మరోవైపు అన్నాడీఎంకే సైతం రజనీ ప్రకటనపై ఆచితూచి స్పందించింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ మంత్రి మాఫోయ్‌ పాండ్యరాజన్‌ మాట్లాడుతూ.. రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. ఎంజీఆర్‌ పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ రజనీ ప్రజలకు పిలుపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరో మంత్రి కడంబూరు రాజు మాట్లాడుతూ... రజనీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావముండదని వ్యాఖ్యానించారు.


టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి మాట్లాడుతూ.. రజనీకి మనస్సాక్షి వుందని, కానీ బీజేపీ బలవంతంగా ఆయన మనస్సాక్షిని చంపేయాలని ప్రయత్నించి పరాజయం పాలైందన్నారు. తుదిగా రజనీ మనస్సాక్షే గెలిచిందన్నారు. రజనీని రాజకీయాల్లోకి లాగి ఆయన ద్వారా అన్నాడీఎంకే ఓట్లను తమ సొంతం చేసుకోవాలని కుట్ర పన్నిందని, కానీ ఈ ప్రయత్నం విఫలమైందంటూ రజనీకి శుభాకాంక్షలు తెలిపారు.


తమిళ మానిల కాంగ్రెస్‌ అధినేత జీకే మూపనార్‌ మాట్లాడుతూ... రజనీ మంచి పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ సీనియర్‌ నేత ఇలగణేశన్‌ మాట్లాడుతూ... దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రజనీ బీజేపీ లాంటి మంచి పార్టీకి మద్దతు ప్రకటించాలని సూచించారు. అన్నాడీఎంకే మాజీ ఎంపీ వైగై సెల్వన్‌ మాట్లాడుతూ... బీజేపీ ఒత్తిడి కారణంగా రజనీ రాజకీయాల్లోకి రాబోనని ప్రకటించారన్నారు. నామ్‌ తమిళర్‌ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ మాట్లాడుతూ... రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆయన క్షేమంగా వుండాలని, సినీపరిశ్రమలో కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. రజనీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని హిందూ మక్కల్‌ కట్చి నిర్వాహకుడు అర్జున్‌ సంపత్‌ అన్నారు. ఆధ్యాత్మిక రాజకీయాల కోసం హిందూ మక్కల్‌ కట్చి పని చేస్తుందన్నారు. రజనీ శ్రీకృష్ణుడు వంటివాడదని, ఆయన ధర్మం పక్కనే నిలబడతారన్నారు. రాష్ట్ర పాలనలో మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడూ లేనట్టేనన్నారు.

Updated Date - 2020-12-30T16:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising