ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమాన సిబ్బందికి ఆ పరీక్షలు బంద్!

ABN, First Publish Date - 2020-03-30T03:31:02+05:30

విమానంలో ప్రయాణించే సిబ్బందికి చేసే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సంస్థ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణించే సిబ్బందికి చేసే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సంస్థ ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఓ పైలట్‌కు కరోనా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఎయిర్ ఇండియా యూనియన్ చేసిన విన్నపం మేరకే డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణం చేయని స్పైస్‌జెట్ పైలట్‌కు కరోనా సోకిందని, ఇటువంటి సమయంలో బ్రీత్ ఎనలైజర్ టెస్టుల వల్ల ఇతర సిబ్బందికి కూడా కరోనా సోకే ప్రమాదముందని ఎయిరిండియా యూనియన్ తెలిపింది. దీంతో ప్రస్తుత విపత్కర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిలిపివేస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. అయితే విమాన సిబ్బంది అందరూ తాము మద్యంతోపాటు నిషేధించిన ఎటువంటి మత్తుపదార్థాలూ తీసుకేలేదంటూ ఓ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు ఉద్యోగి లైసెన్సును మూడేళ్ల పాటు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు డీజీసీఏ పేర్కొంది.

Updated Date - 2020-03-30T03:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising