ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది, గతం కన్నా ఈసారి తక్కువ ఓటింగ్?

ABN, First Publish Date - 2020-02-08T23:49:32+05:30

ఢిల్లీ శాసన సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్నవారిని మాత్రమే పోలింగ్‌కు అనుమతిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసన సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్నవారిని మాత్రమే పోలింగ్‌కు అనుమతిస్తారు. పోలింగ్ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు ఓటింగ్ పుంజుకున్నప్పటికీ, 2015లో నమోదైన ఓటింగ్ కన్నా ఈసారి తక్కువ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


2015లో జరిగిన ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో 67.12 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం సాయంత్రం పోలింగ్ గడువు ముగిసే సమయానికి అందిన సమాచారం ప్రకారం 54.67 శాతం ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. క్యూలైన్లలో ఉన్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ తుది గణాంకాలను ప్రకటిస్తుంది.


ఢిల్లీలో శనివారం పోలింగ్ మొత్తం మీద ప్రశాంతంగా ముగిసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికిన తరుణంలో అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయన్నారు. కేజ్రీవాల్, ఆయన సతీమణి, కుమారుడు పులకిత్ సివిల్ లైన్స్ ఏరియాలోని ఓ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వివిధ వార్తా ఛానళ్లు ప్రకటిస్తాయి.


Updated Date - 2020-02-08T23:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising