ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులో గందరగోళం

ABN, First Publish Date - 2020-04-22T00:22:04+05:30

ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులో ఈ రోజు గందరగోళం నెలకొంది. అత్యవసర సేవలు అందించే వారితోపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులో ఈ రోజు గందరగోళం నెలకొంది. అత్యవసర సేవలు అందించే వారితోపాటు వందలాదిమంది సరిహద్దులో చిక్కుకుపోయారు. కరోనా వైరస్ విస్తరించకుండా అడ్డుకట్ట వేయడంలో భాగంగా సరిహద్దులు మూసేయాలని ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే సోమవారం రాత్రి ఆదేశాలు జారీచేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విపత్తు నిర్వహణ చట్టం కింద ఘజియాబాద్-ఢిల్లీ మధ్య రవాణాను నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో పోలీసులు సరిహద్దులను మూసివేశారు. దీంతో వందలాదిమంది సరిహద్దుకు ఇరువైపులా చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారిలో వైద్యులు, రవాణా సిబ్బంది, బ్యాంకర్లు ఉన్నారు. వారిని అనుమతించేందుకు పోలీసులు ససేమిరా అనడంతో ఇరువైపుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ డ్యూటీ పాస్‌లను చూపించినా పోలీసులు అనుమతించడం లేదని ఓ వైద్యుడు వాపోయాడు.   

Updated Date - 2020-04-22T00:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising