ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో రెండవ రోజూ 100 దాటిన కరోనా మృతులు... కొత్తగా 6,608 కేసులు

ABN, First Publish Date - 2020-11-21T12:16:32+05:30

దేశరాజధాని డిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,608 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 188 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఢిల్లీలో కరోనాతో మరణించినవారి సంఖ్య 8,159కి చేరుకుంది. ఢిల్లీలలో ప్రస్తుతం 40,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడినవారితో పోలిస్తే, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉంది. 


గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,775 మంది కోలుకున్నారు. ఇది కొత్త రికార్డుగా నిలిచింది. దీనికి ముందు జూన్ 20న ఒక్కరోజులో కరోనా నుంచి అత్యధికంగా 7,725 మంది కోలుకున్నారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం కొత్తగా 62.425 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, వారిలో 6,608 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇప్పటివరకూ ఢిల్లీలో 5,17,238 మందికి కరోనా సోకింది. వీరిలో 4,68,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 40,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-11-21T12:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising