ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదుల ఇన్సూరెన్స్ కోసం రూ.40 కోట్లు విడుదల చేసిన ఢిల్లీ కేబినెట్

ABN, First Publish Date - 2020-10-30T21:14:24+05:30

న్యాయవాదులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ ఇవాళ రూ.40 కోట్లు మంజూరు చేసింది. దేశ రాజధాని పరిధిలో నివసిస్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: న్యాయవాదులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ ఇవాళ రూ.40 కోట్లు మంజూరు చేసింది. దేశ రాజధాని పరిధిలో నివసిస్తున్న న్యాయవాదులకు రూ.5 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్, రూ. 10 లక్షల టెర్మ్ ఇన్సూరెన్స్ లభిస్తుందని ఢిల్లీ న్యాయమంత్రి కైలాశ్ గెహ్లాట్ ట్విటర్లో వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి న్యాయవాదుల సంక్షేమ పథకం కింద అడ్వకేట్లకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద న్యాయవాదుల సంక్షేమం కోసం ఆమాద్మీ పార్టీ ప్రభుత్వం రూ.50 కోట్ల కార్పస్ నిధులను కేటాయించింది. న్యాయవాదుల సంక్షేమ నిధులను ఎలా వినియోగించాలన్న దానిపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతేడాది నవంబర్లో 13 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ కుమార్ ఖన్నా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ప్రతి న్యాయవాదికి రూ.5 లక్షల చొప్పున గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీతో పాటు రూ.10 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. ఇదే నిధులతో పని దినాల్లో పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక క్రెచ్ కేంద్రాలతో పాటు, ఈ లైబ్రరీ సదుపాయాలు కల్పించాలని కోరింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ లెక్కప్రకారం ఢిల్లీలో 37,135 మంది లాయర్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో 29,098 మంది ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో సభ్యులుగా ధ్రువీకరణ పొందారు. 

Updated Date - 2020-10-30T21:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising