ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్‌లో కోవిడ్ రోగుల మృతదేహాలు తారుమారు

ABN, First Publish Date - 2020-07-09T03:12:56+05:30

న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో కోవిడ్ రోగుల మృతదేహాలు తారుమారయ్యాయి. మార్చురీ సిబ్బంది మృతదేహాలను తారుమారు చేశారని తెలియగానే మృతుల సంబంధీకులు ఎయిమ్స్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో కోవిడ్ రోగుల మృతదేహాలు తారుమారయ్యాయి. మార్చురీ సిబ్బంది మృతదేహాలను తారుమారు చేశారని తెలియగానే మృతుల సంబంధీకులు ఎయిమ్స్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఒక కుటుంబానికి అప్పగించాల్సిన కోవిడ్ పేషంట్ మృతదేహాన్ని మరో కుటుంబానికి అప్పగించారు. వారు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో వారు ఆందోళన చేపట్టారు. రెండు వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు ఎయిమ్స్ అధికారులు పోలీసుల సాయంతో రెండు కుటుంబాల వారికి నచ్చచెప్పి పంపించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇద్దరు మార్చురీ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.


సాధారణంగా కోవిడ్ కారణంగా చనిపోయే రోగుల మృతదేహాలను శానిటైజ్ చేశాక కవర్‌లో చుట్టి వారి కుటుంబాల వారికి అప్పగిస్తారు. కవర్ తీసి చూస్తే కరోనా సోకే భయం ఉండటంతో ఎవ్వరూ మృతదేహాలను పరిశీలించడం లేదు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేయాలని ఆసుపత్రివర్గాలకైనా చెబుతున్నారు. లేదంటే నేరుగా స్మశానవాటికకు తరలించి తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-07-09T03:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising