ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా కవ్వింపు చర్యలపై కేంద్రం సీరియస్

ABN, First Publish Date - 2020-05-27T00:01:25+05:30

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా చైనాతో తలెత్తిన వివాదంపై చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మాణ పనులు కొనసాగించాలని నిర్ణయించారు. రహదారులు, వంతెనలు, సొరంగాల నిర్మాణాలు కొనసాగించాలని రాజ్‌నాథ్ సూచించారు. గంటకు పైగా సాగిన సమావేశంలో చైనాతో తలెత్తిన వివాదాలపై లోతుగా చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయని రావత్ వివరించారు. చైనా సైనిక హెలికాఫ్టర్లు భారత గగనతలంలోకి దూసుకువచ్చిన ఘటనతోపాటు భారత బలగాలతో చైనా కొట్లాటకు దిగడం వంటి ఘటనలపై చర్చించారు.  


ఈ సమావేశం తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ భేటీ అయ్యారు. చైనాతో వివాదాలపై చర్చించారు. చైనా కవ్వింపు చర్యలపై కేంద్రం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మాణ పనులు మాత్రం యథాతథంగా కొనసాగించాలని కేంద్రం సూచించినట్లు తెలిసింది.  

Updated Date - 2020-05-27T00:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising