బొగ్గు గనుల వేలం చారిత్రకం.. 2.8 లక్షల ఉద్యోగాల కల్పన
ABN, First Publish Date - 2020-06-18T22:41:06+05:30
కమర్షియల్ మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియ చారిత్రక నిర్ణయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ..
న్యూఢిల్లీ: కమర్షియల్ మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియ చారిత్రక నిర్ణయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అభివర్ణించారు. ఇందువల్ల పోటీతత్వం పెరగడంతో పాటు బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకునేందుకు మార్గం సుగగమవుతుందని, తద్వారా ఇంధన రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధిస్తుందని అన్నారు.
'ఆత్మనర్భర్ భారత్' సాధన దిశగా కమర్షియల్ మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వర్చువల్ ఆక్షన్ (వేలం) ప్రక్రియను ప్రధాని మోదీ గురువారంనాడు ప్రారంభించారు. దీనిపై అమిత్‌షా మాట్లాడుతూ, ఇంధన రంగంలో స్వయం సమృద్ధికి, బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకునేందుకు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమిదని చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2.8 లక్షల ఉద్యోగాల కల్పన జరగడంతో పాటు, రూ.33,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించ గలుగుతాయని అన్నారు.
Updated Date - 2020-06-18T22:41:06+05:30 IST