ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో మరణాలు మరీ అంత ఎక్కువేం కాదు: ఐసీఎంఆర్

ABN, First Publish Date - 2020-04-09T00:42:58+05:30

దేశంలోని కోవిడ్-19 మరణాల సంఖ్య మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ అవి మరీ అంత గణనీయమైన స్థాయిలో లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని కోవిడ్-19 మరణాల సంఖ్య మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ అవి మరీ అంత గణనీయమైన స్థాయిలో లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ అధికారి డాక్టర్ రామన్ గాంగాఖేడ్కర్ బుధవారంనాడు అన్నారు. ఇండియాలో మరణాలు కూడా తక్కువగానే ఉన్నందున మహారాష్ట్రలో గణనీయంగా మరణాలు సంభవించినట్టుగా పేర్కొనడం సరికాదని ఐసీఎంఆర్ చీఫ్ సైటింస్ట్‌గా ఉన్న రామన్ పేర్కొన్నారు.


'గణాంకాల ఆధారంగా మరణాలు హెచ్చు, తగ్గులను నిర్ణయించలేం. దేశంలో మరణాల రేటు కూడా తక్కువగానే ఉంది. సంఖ్యల్లో మార్పులు జరిగే అవకాశాలుంటాయి కాబట్టి మహారాష్ట్రలో ఎక్కువ సంఖ్యలో మరణాలు ఉన్నట్టుగా నిర్ధారణకు రాకూడదు. చూడడానికి సంఖ్యా పరంగా ఎక్కువగానే అనిపించినా, అవి గణనీయమైన స్థాయిలో మరణాలు కావు' అని ఆయన వివరించారు.


కాగా, దేశంలో ఎక్కడ ఒక్క మరణం సంభవించినా అది ఆందోళన కలిగించే విషయమేనని, ఆరోగ్య సమస్యలు, వయస్సు వంటి కొన్ని అంశాలు కూడా వీటితో ముడపడి ఉంటాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ముందుగానే వ్యాధి లక్షణాలను గుర్తించగలిగితే సరైన చికిత్సతో వాటిని అదుపుచేసే వీలుంటుందని, ఇందుకు ప్రజల సహకారం కూడా ముఖ్యమని ఆయన అన్నారు.

Updated Date - 2020-04-09T00:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising