రాజస్థాన్‌లో 9 మంది నవజాత శిశువుల మృతి
ABN, First Publish Date - 2020-12-11T08:18:51+05:30
రాజస్థాన్‌లో కోటా నగరంలోని జేకే లోన్ ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన 9 మంది శిశువులు చనిపోయారు.
జైపూర్, డిసెంబరు 10: రాజస్థాన్‌లో కోటా నగరంలోని జేకే లోన్ ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన 9 మంది శిశువులు చనిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ మరణాలు సంభవించాయి. బుధవారం రాత్రి ఐదుగురు శిశువులు మృతి చెందగా.. గురువారం మరో నలుగురు చనిపోయారు. శిశువులందరూ 1 నుంచి 4 రోజుల వయసున్న వారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ విచారణకు ఆదేశించారు. పుట్టుకతో వచ్చే వ్యాధుల వల్లే శిశువులు మరణించారని అధికారులు తెలిపారు.
Updated Date - 2020-12-11T08:18:51+05:30 IST