ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తన అంత్యక్రియలకి తనకే అనుమతి లేదు

ABN, First Publish Date - 2020-12-05T00:32:59+05:30

ఓ వ్యక్తి తన అంత్యక్రియలకు తనకే అనుమతి లభించలేదు. వినడానికి చిత్రంగా ఉంది కదూ... కానీ ఇది నిజంగానే స్పెయిన్‌లో జరిగింది. చె లెవిస్ (29) అనే వ్యక్తిని అతడి తండ్రి అడ్లీ లెవిస్ తుపాకీతో కాల్చి చంపాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్రిడ్: ఓ వ్యక్తి తన అంత్యక్రియలకు తనకే అనుమతి లభించలేదు. వినడానికి చిత్రంగా ఉంది కదూ... కానీ ఇది నిజంగానే స్పెయిన్‌లో జరిగింది. చె లెవిస్ (29) అనే వ్యక్తిని అతడి తండ్రి అడ్లీ లెవిస్ తుపాకీతో కాల్చి చంపాడు. కాగా, చే అంత్యక్రియలను చాలా చిత్రంగా నిర్వహించారు. చేకు కొత్త బట్టలు తొడికి ఒక వీల్‌ చైర్‌లో కూర్చోబెట్టి అంత్యక్రియలు ప్రారంభించారు. అయితే సేయింట్ జాన్ ది ఎవంగెలిస్ట్ చర్చ్‌లోకి చేను చర్చిలోకి అనుమతించలేదు. అతడు చర్చి సమీపంలోకి రాగానే అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో చేను బయటే ఉంచి బంధువులు, మిత్రులంతా అంత్యక్రియలకు నిర్వహించే ప్రార్థనలో పాల్గొన్నారు.


కోవిడ్ ప్రభావం అధికంగా ఉండడంతో చే మాస్క్ వేసుకోలేదని కొంత మంది చేపై విమర్శలు చేశారు. నిజానికి వారికి చే శ్వాస తీసుకోవడం లేదనే విషయం తెలియదు. దీనిని ఆన్‌లైన్‌లో కూడా ప్రసారం చేశారు. వీక్షకుల్లో చాలా మందికి చే చనిపోయాడనే విషయం తెలియదు. ఈ విషయమై చే ఇంటి యజమాని డేనిస్ మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరి జీవితం ప్రత్యేకమైంది. అలాగే అంత్యక్రియలు కూడా ప్రత్యేకంగానే ఉండాలి’’ అని అన్నారు. చే మరణం అనంతరం.. అతడి బంధువుల నుంచి ఈ ప్రతిపాదన వచ్చిందట. అయితే స్పెయిన్‌లో ఇలాంటివి కొత్త కాదని డేనిస్ అన్నారు.

Updated Date - 2020-12-05T00:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising