డీమార్ట్ అధినేత రూ. 155 కోట్ల విరాళం
ABN, First Publish Date - 2020-04-05T07:28:15+05:30
కరోనాపై పోరుకు డీ మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ రూ.155 కోట్ల విరాళం ప్రకటించారు. వీటిలో రూ.100 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు.. మిగతా రూ.55 కోట్లు 11 రాష్ట్రాలకు...
అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం
రూ. 35 కోట్లు ఇచ్చిన సీకే బిర్లా గ్రూప్
నెస్లే ఇండియా రూ. 15 కోట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కరోనాపై పోరుకు డీ మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ రూ.155 కోట్ల విరాళం ప్రకటించారు. వీటిలో రూ.100 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు.. మిగతా రూ.55 కోట్లు 11 రాష్ట్రాలకు అందజేస్తాన న్నారు. తెలంగాణకు రూ.5 కోట్లు, ఏపీకి రూ.5 కోట్లు అందుతాయి. అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు అందజేస్తామని చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. సేవా కార్యక్రమాలకు మరో రూ. 4 కోట్లు ఇస్తామన్నారు. తమ సంస్థ ఉద్యోగులు మరో రూ.4కోట్లు ఇస్తారని చెప్పారు. సీకే బిర్లా గ్రూప్ రూ.35 కోట్ల విరాళం ప్రకటించింది. దీనిలో రూ.25 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌కు.. రూ.10 కోట్లు వైద్య పరికరాలు, మాస్కులు, పీపీఈలు కొనడానికి రాష్ట్రాలకు ఇస్తామని పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.5.65 కోట్లు ఇచ్చిం ది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా రూ.15 కోట్లు ప్రకటించింది. ఆస్పత్రుల్లో వాడే వైద్య పరికరాలు, వెంటిలేటర్లకు కూడా నిధులిస్తామని తెలిపింది. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది.
Updated Date - 2020-04-05T07:28:15+05:30 IST