ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరం దాటనున్న బురేవి తుపాన్

ABN, First Publish Date - 2020-12-03T14:01:56+05:30

‘బురేవి’ తుపాన్ తీరం దాటనుంది. బురేవి తుపాన్ గత ఆరు గంటల్లో 12 కిలోమీటర్ల ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం : ‘బురేవి’ తుపాన్ తీరం దాటనుంది. బురేవి తుపాన్ గత ఆరు గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లి త్రికోణమలికి వాయువ్య దిశలో 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారతవాతావరణ శాఖ గురువారం తెల్లవారుజామున వెల్లడించింది. బురేవి తుపాన్ ప్రభావం వల్ల త్రివేండ్రం జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకున్నామని తిరువనంతపురం జిల్లా కమిషనర్ నవజోత్ సింగ్ ఖోసా చెప్పారు. తుపాన్ ముప్పు నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, వైమానిక దళం, నావికాదళ సిబ్బందితో 8 బృందాలను సహాయ చర్యల కోసం మోహరించామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. లోతట్టుప్రాంతాల్లో ఉన్న 175 కుటుంబాలకు చెందిన 697 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. బురేవి తుపాన్ ముప్పు దృష్ట్యా గురువారం తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అల్లప్పుజ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

Updated Date - 2020-12-03T14:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising