ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతికి వచ్చే జీతంలో కోత!

ABN, First Publish Date - 2020-12-10T07:22:49+05:30

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగస్తుల చేతికి వచ్చే జీతంలో కోత పడనుందా..? వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలులోకి రానున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏప్రిల్‌ నుంచి కొత్త వేతన నిబంధనలు

న్యూఢిల్లీ, డిసెంబరు 9: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగస్తుల చేతికి వచ్చే జీతంలో కోత పడనుందా..? వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలులోకి రానున్న కొత్త వేతన నిబంధనల బట్టి చూస్తే.. దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. కొత్త వేతన చట్టం కింద.. ప్రభుత్వం ముసాయిదా నిబంధనల్ని ఇటీవల నోటిఫై చేసింది. వీటి ప్రకారం.. భత్యం(అలవెన్సు) మొత్తం జీతంలో 50శాతానికి మించకూడదు.


అంటే సంస్థలు ఉద్యోగులకిచ్చే మూలవేతనాన్ని 50శాతంగా మార్చాల్సి ఉంటుంది. ఫలితంగా గ్రాట్యుటీ, ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎ్‌ఫ)ల కేటాయింపుల్లో పెరుగుదల తప్పదు. ప్రస్తుతం అన్ని ప్రైవేటు సంస్థలూ అలవెన్సుల శాతాన్ని ఎక్కువగా.. మూలవేతనాన్ని 50శాతంకంటే తక్కువగా ఇస్తున్నాయి. కొత్త వేతన నిబంధనలు అమలులోకి రాగానే ఈ విధానం మారిపోనుంది. పీఎ్‌ఫకు, గ్రాట్యుటీలకు ఎక్కువగా జీతం వెళ్లిపోనుండటంతో.. ఉద్యోగి చేతికి వచ్చే జీతం తగ్గిపోతుంది. అయితే.. పదవీవిరమణ అనంతరం మాత్రం ఈ విధానం వలన ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


Updated Date - 2020-12-10T07:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising