ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ నుండి ఉద్యోగుల టేక్-హోం శాలరీలో కోత..!

ABN, First Publish Date - 2020-12-11T21:30:03+05:30

వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22 నుండి ఉద్యోగుల నికర వేతనాలలో కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన న్యూవేజ్ రూల్ డ్రాఫ్ట్ ప్రకారం ఇకపై అలవెన్స్‌ల వాటా 50 శాతానికి మించరాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22 నుండి ఉద్యోగుల నికర వేతనాలలో కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన న్యూవేజ్ రూల్ డ్రాఫ్ట్ ప్రకారం ఇకపై అలవెన్స్‌ల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో మూల వేతనాన్ని 50 శాతంగా నిర్ణయించాలి. ‘2019 కొత్త వేతన నిబంధనలు’కు గతేడాది పార్లమెంటు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుండి ఇవి అమలు కానున్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో... కంపెనీలు పే-ప్యాకేజీలో సవరణలు చేపట్టే పరిస్థితులు నెలకొన్నాయి. తత్ఫలితంగా టేక్-హోం శాలరీ తగ్గవచ్చని భావిస్తున్నారు.  


కొత్త వేతన నిబంధనల డ్రాఫ్టు ప్రకారం కంపెనీలు పే-ప్యాకేజీని పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఉద్యోగుల చేతికి వచ్చే వేతనం వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి తగ్గవచ్చని చెబుతున్నారు. ఈ నిబంధన ప్రకారం ఉద్యోగి మొత్తం వేతనంలో కాంపెన్షేషన్ 50 శాతం మించరాదు. అంటే మూల వేతనం కనీసం 50 శాతంగా ఉండాల్సి ఉంటుంది. 


టేక్ హోం శాలరీ తగ్గి... రిటైర్మెంట్ కార్పస్ పెరుగుతుంది... కాంపెన్షేషన్ 50 శాతం మించవద్దంటే బేసిక్ శాలరీ కనీసం యాభై శాతంగా ఉండాలంటే.. యాజమాన్యాలు ఉద్యోగుల వేతనాలు పెంచాల్సి ఉంటుంది. అలా అయితే గ్రాట్యుటీ పేమెంట్స్, ప్రావిడెంట్ ఫండ్‌కు కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీంతో ఉద్యోగుల ‘టేక్ హోం వేతనం’ తగ్గుతుంది. అయితే... రిటైర్మెంట్ కార్పస్ మాత్రం పెరుగుతుంది. 


ఉద్యోగుల వేతనాలపై ప్రభావం... ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు నాన్-అలవెన్స్ వేతనం 50 శాతం కంటే తక్కువ, అలెవెన్స్ భాగం 50 శాతం కంటే ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాయి. కొత్త వేతన నిబంధనలు అమల్లోకి వస్తే ఈ సమీకరణం మారిపోతుంది. సాధారణంగా అధిక జీతభత్యాలు పొందే ప్రైవేటురంగ ఉద్యోగుల వేతనాలపై ఇది ప్రభావం చూపుతుంది. 


ఇలా ప్రయోజనమే.... కొత్త వేతన నిబంధనల వల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గినప్పటికీ, ఉద్యోగులకు సామాజిక భద్రత, పదవీవిరమణ అనంతర ప్రయోజనాలు పెరుగుతాయని చెబుతున్నారు. కొత్త వేతన నిబంధన ప్రకారం నాన్-అలవెన్స్ వాటా 50 శాతానికి పెంచితే కంపెనీలకు 10-12 శాతం మేర ఉద్యోగవ్యయాలు పెరగే పరిస్థితి ఏర్పడుతుంది. కాగా... తుది నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం ముసాయిదా నిబంధనలు ఇప్పటికే జారీ అయ్యాయి. 


Updated Date - 2020-12-11T21:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising