ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే ఇంటి ముందు అల్లర్లు.. ముగ్గురి మృతి.. 144 సెక్షన్

ABN, First Publish Date - 2020-08-12T15:34:32+05:30

అల్లర్లతో రణరంగంగా మారిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కర్ఫ్యూ కొనసాగుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: అల్లర్లతో రణరంగంగా మారిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కర్ఫ్యూ కొనసాగుతోంది. అక్కడ 144 సెక్షన్ అమలులోకి తెచ్చారు. బెంగళూరు నగరంతోపాటు కేజే హళ్లి, డీజే హళ్లిలో నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసంపై గత రాత్రి అల్లరిమూక దాడికి పాల్పడింది. అక్కడితో ఆగని అల్లరి మూకలు పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. కొన్నింటిని తగులబెట్టారు.


పరిస్థితులను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసంతోపాటు బెంగళూరు తూర్పులోని కేజే హళ్లి పోలీస్ స్టేషన్‌పై కూడా అల్లరిమూక దాడి చేసింది. ఎమ్మెల్యే మేనల్లుడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు అల్లర్లకు దారితీసింది. ఒక వర్గాన్ని కించపరిచేలా పోస్టు ఉందంటూ కొందరు ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. అల్లర్ల ఘటనలో ఏసీపీ సహా 60 మంది పోలీసులు గాయపడినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 147 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై హోంమంత్రి దర్యాప్తుకు ఆదేశించారు. దాటికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-08-12T15:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising