క్రొయేషియన్ ప్రధానమంత్రి ఆండ్రేజ్‌కు కరోనా
ABN, First Publish Date - 2020-12-01T13:52:07+05:30
క్రొయేషియన్ ప్రధానమంత్రి ఆండ్రేజ్ ప్లెన్ కోవిక్ కరోనా వైరస్ బారిన పడ్డారు.....
బెల్గ్రేడ్ (క్రొయేషియన్) : క్రొయేషియన్ ప్రధానమంత్రి ఆండ్రేజ్ ప్లెన్ కోవిక్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రధాని భార్యకు కొవిడ్-19 పాజిటివ్ అని రావడంతో ప్రధాని ఆండ్రేజ్ 10 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అనంతరం వైద్యనిపుణుల సిఫారసు మేర ప్రధానమంత్రి ఆండ్రేజ్ ప్లెన్ కోవిక్ కు పరీక్ష చేయించుకోగా ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా సోకినా ఆరోగ్యంగా ఉండటంతో ప్రధాని ఆండ్రేజ్ ఇంటి నుంచే అధికారిక విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా బారినపడిన ప్రధాని ఆండ్రేజ్ వైద్యనిపుణుల సూచనలు పాటిస్తున్నారని క్రొయేషియన్ కేబినెట్ ట్వీట్ చేసింది.
Updated Date - 2020-12-01T13:52:07+05:30 IST