ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యప్రదేశ్‌లో ‘ఆవు పన్ను’: సీఎం చౌహాన్‌

ABN, First Publish Date - 2020-11-23T07:24:55+05:30

మధ్యప్రదేశ్‌లో గోవుల సంరక్షణకు ‘ఆవు పన్ను’ను ప్రవేశపెడ్తామని సీఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఆదివారం గోపాష్టమి సందర్భంగా అగర్‌మాల్వా జిల్లా సలారియా గ్రామంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గో సంరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ


భోపాల్‌, నవంబరు 22: మధ్యప్రదేశ్‌లో గోవుల సంరక్షణకు ‘ఆవు పన్ను’ను ప్రవేశపెడ్తామని సీఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఆదివారం గోపాష్టమి సందర్భంగా అగర్‌మాల్వా జిల్లా సలారియా గ్రామంలోని గోవుల అభయారణ్యంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవు పన్నుతో గోవుల కోసం షెట్లు ఏర్పాటు చేస్తామని చౌహాన్‌ తెలిపారు. ‘‘పౌష్ఠికాహారం కోసం అంతా కోడిగుడ్డును తినాలంటారు. అయితే.. ఆవుపాలను ప్రోత్సహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆయన వివరించారు. అంతకు ముందు ‘గోవు కేబినెట్‌’పై వర్చువల్‌గా నిర్వహించిన తొలి భేటీకి సీఎం అధ్యక్షత వహించారు. గోవులు, వాటి ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని వివరించారు. 


Updated Date - 2020-11-23T07:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising