ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్‌‌ నాలుగో అంతస్థుపైనుంచి దూకి చనిపోయిన జర్నలిస్ట్

ABN, First Publish Date - 2020-07-07T05:25:48+05:30

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నాలుగో అంతస్థుపైనుంచి దూకి తరుణ్ సిసోడియా అనే జర్నలిస్ట్ చనిపోయాడు. ఢిల్లీలోనే ఉంటూ ఓ హిందీ పత్రికకు పనిచేస్తున్న 37 సంవత్సరాల తరుణ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నాలుగో అంతస్థుపైనుంచి దూకి తరుణ్ సిసోడియా అనే జర్నలిస్ట్ చనిపోయాడు. ఢిల్లీలోనే ఉంటూ ఓ హిందీ పత్రికకు పనిచేస్తున్న 37 సంవత్సరాల తరుణ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన తాను చికిత్స పొందుతున్న మొదటి అంతస్థు నుంచి నాలుగో అంతస్థుకు పరిగెత్తారు. ఆయన్ను ఆపేందుకు హాస్పిటల్ సిబ్బంది యత్నించారు. అయితే ఆయన ఈలోగానే నాలుగో అంతస్థు అద్దాలు పగలగొట్టి కిందకు దూకేశారు. తీవ్రగాయాలపాలైన తరుణ్‌ను ఐసీయూకు తరలించినా వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఘటనపై కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విచారణకు ఆదేశించారు. ఘటనతో తాను షాక్‌కు గురయ్యానని హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. తరుణ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.  


వెంటనే హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని హర్షవర్ధన్ ఎయిమ్స్ డైరక్టర్‌ను ఆదేశించారు. 


Updated Date - 2020-07-07T05:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising