ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అలర్ట్: ఆ నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటన

ABN, First Publish Date - 2020-11-25T17:09:08+05:30

కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. హరియాణా, గుజరాత్, రాజస్థాన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. హరియాణా, గుజరాత్, రాజస్థాన్, మణిపూర్‌లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర వైద్య బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించనుంది. అక్కడి వైద్యాధికారులుతో కేంద్ర బృందం కోవిడ్ -19 స్థితి గతుల గురించి చర్చించనుంది. దీనితోపాటు కంటైన్మెంట్ జోన్ల పరిస్థితి, కరోనా కట్టడి చర్యలు మొదలైన వివరాలు తెలుసుకోనున్నారు.


కాగా ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతోపాటు కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. హరియాణా, రాజస్థాన్ ప్రజలు డీల్లీకి రాకపోకలు సాగిస్తుండటంతో ఆయా రాష్ట్రాలలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ముగ్గురు వైద్యుల బృందంతో పాటు హరియాణాలో పర్యటించనున్నారు. అలాగే గుజరాత్, రాజస్థాన్, మణిపూర్‌లలో కూడా వైద్య బృందాలు పర్యటించనున్నాయి.

Updated Date - 2020-11-25T17:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising