ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతదేశంలో నవంబరు నాటికి కొవిడ్ వ్యాక్సిన్

ABN, First Publish Date - 2020-09-18T11:53:03+05:30

రష్యాకు చెందిన కొవిడ్ -19 స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను భారతదేశంలో పంపిణీ చేయడానికి డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ రష్యన్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యన్ ఫండ్ సీఈవో కిరిల్ డిమిత్రివ్ వెల్లడి

న్యూఢిల్లీ : రష్యాకు చెందిన కొవిడ్ -19 స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను భారతదేశంలో పంపిణీ చేయడానికి డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ రష్యన్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.రష్యన్ ఫండ్  సీఈఓ కిరిల్ డిమిత్రివ్, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరి ఎండి జీవీ ప్రసాద్ లు స్పుత్నిక్-వి కరోనా టీకా గురించి ఈ విషయం వెల్లడించారు. నవంబరు నాటికి భారతదేశంలో కొవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ క్లియరెన్సు కోసం వేచి ఉన్నామని రష్యన్ ఫండ్ సీఈవో డిమిత్రివ్ చెప్పారు. 


రష్యా యొక్క స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌పై లేవనెత్తిన సందేహాల గురించి అడిగిన ప్రశ్నలకు రష్యన్ ఫండ్  సీఈఓ కిరిల్ డిమిత్రివ్ ఇలా అన్నారు, ‘‘ఇది పాశ్చాత్య సంస్థల ప్రతికూల ప్రచారానికి స్పష్టమైన ఉదాహరణ. మా టీకా మానవ కణాలపై ఆధారపడింది. పాశ్చాత్య వ్యాక్సిన్లు పరీక్షించలేదు, పోటీదారులు మాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టీకా సురక్షితమైనది, చాలా అధునాతనమైనది.’’ అని వివరించారు. రెగ్యులేటరీ అధికారుల ఆమోదానికి లోబడి భారతదేశంలో నవంబరు నాటికి 40వేల మంది ప్రజలు ఈ టీకా పొందవచ్చని కిరిల్ డిమిత్రివ్ చెప్పారు. 


 డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ కో-ఛైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ జివి ప్రసాద్, ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ డిమిత్రివ్ భారతదేశంలో కొవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు తాజాగా వెలుగుచూశాయి.‘‘మేం రష్యన్ డెవలప్ మెంట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) తో ఒక అవగాహన ఒప్పందం (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్) పై సంతకం చేశాం. వ్యాక్సిన్ (స్పుత్నిక్-వి) ను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలని ఆశిస్తున్నాం’’ అని  డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ కో-ఛైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ జివి ప్రసాద్ జివి ప్రసాద్ చెప్పారు. 

Updated Date - 2020-09-18T11:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising