ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యప్రదేశ్‌లో ఆరుగురు మంత్రులకు కరోనా

ABN, First Publish Date - 2020-08-22T11:52:13+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోపాటు ఆరుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శుక్రవారం 1147 కరోనా కేసులు వెలుగుచూడటంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50, 640కు పెరిగింది. తనకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైందని మధ్యప్రదేశ్ రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ మంత్రి గోపాల్ భార్గవ ట్వీట్ చేశారు. డాక్టర్ల సలహా మేర తాను ఆసుపత్రిలో చేరానని మంత్రి గోపాల్ భార్గవ పేర్కొన్నారు. గత కొంతకాలంగా తనను కలిసిన వారందరూ ముందుజాగ్రత్తగా హోంక్వారంటైన్ లోకి వెళ్లాలని మంత్రి సూచించారు. గతంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తోపాటు ఐదుగురు మంత్రులకు కరోనా వచ్చింది. తాజాగా మరో మంత్రి గోపాల్ భార్గవకు కూడా కరోనా రావడంతో కరోనా సోకిన మంత్రుల సంఖ్య ఆరుకు చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మధ్యప్రదేశ్ సర్కారు మూడు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. 

Updated Date - 2020-08-22T11:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising