ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీఎంబీ ‘డ్రై స్వాబ్‌’ కొవిడ్‌-19 టెస్టుకు ఐసీఎంఆర్‌ పచ్చజెండా

ABN, First Publish Date - 2020-11-28T08:02:25+05:30

హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్‌ కొవిడ్‌-19 పరీక్షకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) శుక్రవారం ఆమోదం తెలిపింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 27: హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్‌ కొవిడ్‌-19 పరీక్షకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షా పద్ధతిలో .. సేకరించిన ముక్కు స్రావాల నమూనాలను వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం(వీటీఎం) ద్రావణంలోకి ప్రవేశపెట్టి ఒక సీసాలో భద్రపరిచి టెస్టింగ్‌ సెంటర్లకు తరలిస్తుంటారు. ఈక్రమంలో శాంపిళ్లతో కూడిన సీసాల్లో లీకేజీ జరుగుతోంది. ఫలితంగా టెస్టు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో పాటు లీకేజీ కారణంగా శాంపిల్స్‌ తరలించే సిబ్బందికి ఇన్ఫెక్షన్‌ ముప్పు పొం చి ఉంటోంది. ఈ అవాంతరాలన్నీ అధిగమించేలా.. స్రావాల నమూనాల నుంచి ఆర్‌ఎన్‌ఏను సేకరించాల్సిన అవసరం లేని డ్రై స్వాబ్‌ పరీక్షా పద్ధతిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.  

Updated Date - 2020-11-28T08:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising