ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ‌ధానిలో 715 నుంచి 496 త‌గ్గిన కంటైన్మెంట్ జోన్లు

ABN, First Publish Date - 2020-08-02T16:41:22+05:30

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఏర్పాటుచేసిన‌ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 715 నుంచి 496 కి తగ్గింది. ఇంతకుముందు కంటైన్మెంట్ జోన్లలో 3,48,099 మంది ఉండ‌గా, ఇప్పుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఏర్పాటుచేసిన‌ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 715 నుంచి 496 కి తగ్గింది. ఇంతకుముందు కంటైన్మెంట్ జోన్లలో 3,48,099 మంది ఉండ‌గా, ఇప్పుడు అక్క‌డ ఉంటున్న‌వారి సంఖ్య‌ 1,06,211గా ఉంది. ఢిల్లీ రెవెన్యూ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఈ సమాచారం మీడియాకు అందించారు. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 89.33శాతంగా ఉండ‌గా, 7.75 శాతం యాక్ట‌వ్ కేసులు ఉన్నాయి. 2.91శాతం బాధితులు మృతిచెందారు. గ‌డ‌చిన‌ 24 గంటల్లో ఢిల్లీలో కొత్త‌గా 1,118 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తంమీద‌ 1,36,716 కేసులు నమోదయ్యాయి. గడ‌చిన‌ 24 గంటల్లో 1,201 మంది రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం మీద‌ 1,22,131 మంది రోగులు కోలుకున్నారు. గత 24 గంటల్లో 26 మంది రోగులు మృతిచెంద‌గా, మొత్తం మరణాల సంఖ్య 3,989కు చేరుకుంది. గడ‌చిన‌ 24 గంటల్లో 1,201 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తంమీద‌ 12, 2131 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో మొత్తం 10,596 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. హోంక్వారంటైన్‌లో 5, 660 మంది బాధితులు ఉన్నారు. గత 24 గంటల్లో 5,140 ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగాయి. గత 24 గంటల్లో 13,014 యాంటీజెన్ పరీక్షలు జ‌రిగాయి. 

Updated Date - 2020-08-02T16:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising